Motivational Quotes by Chanakya | Motivational Quotes

Motivational Quotes by Chanakya. Chanakya is a very intelligent person and a great scholar. Here are few quotes Chanakya.

Motivational Quotes by Chanakya

“Learn from the mistakes of others, You can’t afford to make them all on your own”
“ఇతరుల తప్పుల నుండి నేర్చుకోండి, మీరు వాటన్నింటినీ మీ స్వంతంగా చేయలేరు”


“Never make friends with people who are above or below you in status. Such friendships will never give you any happiness”
“స్థాయి లో మీకంటే పైన లేదా క్రింద ఉన్న వ్యక్తులతో ఎప్పుడూ స్నేహం చేయవద్దు. అలాంటి స్నేహాలు నీకు సంతోషాన్ని ఇవ్వవు”


“There is some self-interest behind every friendship. There is no friendship without self-interests. This is a bitter truth.”
“ప్రతి స్నేహం వెనుక కొంత స్వార్థం ఉంటుంది. స్వప్రయోజనాలు లేకుండా స్నేహం లేదు. ఇది చేదు నిజం.”


“The biggest guru-mantra is: never share your secrets with anybody. It will destroy you”
“అతి పెద్ద గురు-మంత్రం: మీ రహస్యాలను ఎవరితోనూ పంచుకోవద్దు. అది నిన్ను నాశనం చేస్తుంది”


“The fragrance of flowers spreads only in the direction of the wind. But the goodness of a person spreads in all directions”
“పువ్వుల సువాసన గాలి దిశలో మాత్రమే వ్యాపిస్తుంది. కానీ మనిషి మంచితనం నలువైపులా వ్యాపిస్తుంది”

Motivational Quotes by Chanakya


“A person who cannot decide his goal, simply cannot win.”
“తన లక్ష్యాన్ని నిర్ణయించుకోలేని వ్యక్తి గెలవలేడు.”


“A man is great by deeds, not by birth”
“మనిషి పుట్టుకతో కాదు, వాడు చేసే పనుల ద్వారా గొప్పవాడు అవుతాడు”


“Even if a snake is not poisonous, it should pretend to be venomous.”
“పాము విషపూరితం కాకపోయినా, అది విషపూరితమైనదిగా నటించాలి.”

“God is not present in idols. Your feelings are your god. The soul is your temple”
“దేవుడు విగ్రహాలలో లేడు. మీ భావాలే మీ దేవుడు. ఆత్మే నీ దేవాలయం”


“There is poison in the fang of the serpent, in the mouth of the fly and in the sting of a scorpion; but the wicked man is saturated with it”
“పాముకి కోరల్లో, ఈగకి నోటిలో మరియు తేలుకి తోకలో విషం ఉంటుంది; కానీ చెడ్డవాడికి నిలువెల్లా విషం నిండి ఉంటుంది”


“One whose knowledge is confined to books and whose wealth is in the possession of others, can use neither his knowledge nor wealth when the need for them arises”
“ఎవరికైతే జ్ఞానం పుస్తకాలకే పరిమితమౌతుందో, సంపద ఇతరుల ఆధీనంలో ఉంటుందో, తన జ్ఞానాన్ని లేదా సంపదను అవసరమైనప్పుడు ఉపయోగించుకోలేడు”

Motivational Quotes by Chanakya


A man shouldn’t live in a place where people are not afraid of the law, are shameless, and there is no clever man, where people lack in kindness, and where exists no creativity or art.”
“ప్రజలకు చట్టo అంటే భయం, సిగ్గు, తెలివి, దయ, సృజనాత్మకత, కళ లేని ప్రదేశంలో మనిషి నివసించకూడదు.”


“It is imprudent to advise a fool, care for a woman with bad character and to be in the company of a lethargic and unhappy person.”
“ఒక మూర్ఖుడికి సలహా ఇవ్వడం, చెడు స్వభావం ఉన్న స్త్రీ పట్ల శ్రద్ధ వహించడం మరియు నీరసంగా ఉంటూ సంతోషంగా లేని వ్యక్తితో సహవాసం చేయడం అవివేకం.”


“Do not spend even a single day where you can not find five things: Successful businessmen, educated brahmins, soldiers, a river and a doctor”
“విజయవంతమైన వ్యాపారవేత్తలు, చదువుకున్న బ్రాహ్మణులు, సైనికులు, నది మరియు వైద్యుడు ఈ ఐదు దొరకని చోట ఒక్క రోజు కూడా గడపవద్దు” yt, short, ins, fb


“Whoever helps you at the time of illness, misfortune, famines, and invasion is your true brother in the real sense.”
“అనారోగ్యం, దురదృష్టం, కరువులు మరియు దండయాత్రల సమయంలో మీకు సహాయం చేసే వ్యక్తి మీ నిజమైన సోదరుడు.”


“A true son is obedient, a true father is loving, and a true friend is honest”
“నిజమైన కొడుకు విధేయుడు, నిజమైన తండ్రి ప్రేమగలవాడు మరియు నిజమైన స్నేహితుడు నిజాయితీపరుడు”


“Always keep your biggest plans as a secret. The simplest suggestion is to continue the task without grabbing much attention.”
“మీ అతిపెద్ద ప్రణాళికలను ఎల్లప్పుడూ రహస్యంగా ఉంచండి. ఎక్కువ దృష్టిని ఆకర్షించకుండా పనిని కొనసాగించాలి.”

Motivational Quotes by Chanakya


“A wise person grooms his child carefully because only an educated person with high morale is given true respect in society.”
“ఒక తెలివైన వ్యక్తి తన బిడ్డను జాగ్రత్తగా చూసుకుంటాడు, ఎందుకంటే ఉన్నత నైతికత ఉన్న విద్యావంతుడికి మాత్రమే సమాజంలో నిజమైన గౌరవం లభిస్తుంది.”


“A person should not be too honest. Straight trees are cut first and honest people are screwed first”
“ఒక వ్యక్తి చాలా నిజాయితీగా ఉండకూడదు. నిటారుగా ఉన్న చెట్లను ముందుగా నరికినట్టు, నిజాయితీపరులను ముందుగా చిత్తు చేస్తారు”


“The world’s biggest power is the youth and beauty of a woman.”
“ప్రపంచంలోని అతిపెద్ద శక్తి ఏంటి అంటే యువత మరియు ఒక మహిళ యొక్క అందం.”


“Education is the best friend. An educated person is respected everywhere. Education beats the beauty and the youth”
“విద్య మనిషికి మంచి స్నేహితుడు. చదువుకున్న వ్యక్తిని ప్రతిచోటా గౌరవిస్తారు. విద్య అందం మరియు యువతను ఓడించింది”


“Never reveal what you have thought upon doing, but by wise council keep it secret being determined to carry it into execution”
“మీరు చేయలి అని అనుకున్నది ఎప్పుడూ బహిర్గతం చేయకండి, అమలులోకి తీసుకు వచ్చే దాకా దానిని రహస్యంగా ఉంచండి”


“As soon as the fear approaches near, attack and destroy it”
“భయం సమీపించిన వెంటనే, దాడి చేసి నాశనం చేయండి”

Motivational Quotes by Chanakya

Motivational Quotes by Chanakya


“Books are as useful to a stupid person as a mirror is useful to a blind person”
“అద్దం గుడ్డివాడికి ఎంత ఉపయోగపడుతుందో మూర్ఖుడికి పుస్తకాలు అంతే ఉపయోగపడతాయి”


“The life of an uneducated man is as useless as the tail of a dog which neither covers its rear end nor protects it from the bites of insects”
“అవిద్యావంతుని జీవితం కుక్క తోక వలె పనికిరానిది, అది దాని వెనుక భాగాన్ని కప్పదు లేదా కీటకాల కాటు నుండి రక్షించదు”


“As a single withered tree, if set aflame, causes a whole forest to burn, so does a rascal son destroy a whole family”
“ఒక్క ఎండిపోయిన చెట్టుకు మంటలు చెలరేగితే అడవి మొత్తం ఎలాగైతే కాలిపోతుంది, అలాగే ఒక దుష్ట కొడుకు కుటుంబాన్ని నాశనం చేస్తాడు”


“We should not fret for what is past, nor should we be anxious about the future; men of discernment deal only with the present moment”
“మనం గతం గురించి చింతించకూడదు లేదా భవిష్యత్తు గురించి ఆందోళన చెందకూడదు; వివేచన ఉన్నవారు ప్రస్తుత క్షణంతో మాత్రమే వ్యవహరిస్తారు”


“There is no disease so destructive as lust.”
“కామం వంటి వినాశకరమైన వ్యాధి లేదు.”


“A man must act as per the situation instead of day dreaming. Chanakya advises not to trust everyone”
“ఒక మనిషి పగటి కలలు కనే బదులు పరిస్థితికి అనుగుణంగా ప్రవర్తించాలి. అందరినీ నమ్మవద్దని చాణక్యుడు సలహా ఇస్తున్నాడు”

Motivational Quotes by Chanakya


Chanakya advises not to overindulge with your child, pupil, and students. It will spoil them.
మీ పిల్లలతో, విద్యార్థులతో అతిగా ప్రవర్తించవద్దని చాణక్యుడు సలహా ఇస్తున్నాడు. అది వారిని పాడు చేస్తుంది.


“Rain which falls upon the sea is useless; so is food for one who is satiated; in vain is a gift for one who is wealthy; and a burning lamp during the daytime is useless.”
“సముద్రం మీద కురిసే వర్షం పనికిరానిది; అలాగే తృప్తిగా ఉన్నవారికి ఆహారం పనికిరానిది; ధనవంతునికి బహుమానం పనికిరాదు; మరియు పగటిపూట మండే దీపం పనికిరాదు.”

“Women have hunger two-fold, shyness four-fold, daring six-fold, and lust eight-fold as compared to men.”
“పురుషులతో పోలిస్తే స్త్రీలకు ఆకలి రెండు రెట్లు, సిగ్గు నాలుగు రెట్లు, ధైర్యం ఆరు రెట్లు మరియు కామం ఎనిమిది రెట్లు ఎక్కువ ఉంటాయి.”


“Once you start a working on something, don’t be afraid of failure and don’t abandon it. People who work sincerely are the happiest.”
“మీరు ఏదైనా పనిని ప్రారంభించిన తర్వాత, వైఫల్యానికి భయపడకండి మరియు దానిని వదులుకోకండి. హృదయపూర్వకంగా పని చేసేవాళ్లే ఎక్కువ సంతోషంగా ఉంటారు.”


“Even a captured enemy is not to be trusted.”
“బంధించబడిన శత్రువును కూడా విశ్వసించకూడదు.”


“It is narual for enemy to attack on the weaker side of the adversary.”
“ప్రత్యర్థి యొక్క బలహీనత పై శత్రువు దాడి చేయడం సహజం.”

Motivational Quotes by Chanakya


“If a king is energetic, his subjects will be equally energetic. If he is reckless, they will not only be reckless likewise
“ఒక రాజు శక్తివంతంగా ఉంటే, అతని పౌరులు సమాన శక్తివంతులుగా ఉంటారు, అతను నిర్లక్ష్యంగా ఉంటే, వారు కూడా అలాగే నిర్లక్ష్యంగా ఉండరు.


“Skills are called hidden treasure as they save like a mother in a foreign country.”
“నైపుణ్యాలను దాచిన నిధి అని పిలుస్తారు, ఎందుకంటే అవి విదేశాలలో తల్లిలాగా కాపాడతాయి.”


“Don’t judge the future of a person based on his present conditions, becausetime has the power to change black coal to shiny diamond.”
“ఒక వ్యక్తి ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా అతని భవిష్యత్తును అంచనా వేయవద్దు, ఎందుకంటే కాలానికి నల్ల బొగ్గును మెరిసే వజ్రంగా మార్చే శక్తి ఉంది.”


“As a whole forest becomes fragrant by the existence of a single tree with sweet-smelling blossoms in it, so a family becomes famous by the birth of a virtuous son.”
“ఒక వృక్షంలో సువాసనతో కూడిన పువ్వులు ఉండటం వల్ల అడవి మొత్తం సువాసనతో నిండినట్లే, సద్గుణ సంపన్నుడైన కొడుకు పుట్టడం ద్వారా కుటుంబం ప్రసిద్ధి చెందుతుంది.”


“Do not put your trust in a bad companion nor even trust an ordinary friend, for if he should get angry with you, he may bring all your secrets to light.”
“చెడ్డ సహచరుడిపై నమ్మకం ఉంచవద్దు లేదా సాధారణ స్నేహితుడిని కూడా నమ్మవద్దు, ఎందుకంటే అతను మీతో కోపంగా ఉంటే, అతను మీ రహస్యాలన్నింటినీ వెలుగులోకి తెస్తాడు.”


“A permanent relationship is dependent on particular purpose or wealth.”
“శాశ్వత సంబంధం నిర్దిష్ట ప్రయోజనం లేదా సంపదపై ఆధారపడి ఉంటుంది.”

Motivational Quotes by Chanakya

Motivational Quotes by Chanakya


“Prosperity lasts long for one who acts after proper consideration.”
“సరియైన పరిశీలన తర్వాత పనిచేసే వ్యక్తికి శ్రేయస్సు చాలా కాలం ఉంటుంది.”


“The wise man should restrain his senses like the crane and accomplish his purpose with due knowledge of his place, time and ability.”
“జ్ఞాని అయిన వ్యక్తి తన ఇంద్రియాలను నిగ్రహించాలి మరియు తన స్థలం, సమయం మరియు సామర్థ్యం గురించి తగిన జ్ఞానంతో తన లక్ష్యాన్ని సాధించాలి.”


“No one can defeat a powerful mind.”
“శక్తివంతమైన మెదడును ఎవరూ ఓడించలేరు.”


“Wealth, a friend, a wife, and a kingdom may be regained, but this body when lost may never be acquired again.”
“సంపద, స్నేహితుడు, భార్య మరియు రాజ్యం తిరిగి పొందవచ్చు, కానీ ఈ శరీరం పోగొట్టుకున్నప్పుడు మళ్ళీ పొందలేము.”


“Just as it is impossible to know when a swimming fish is drinking water, so it is impossible to find out when a government servant is stealing money.”
“ఈతకొట్టే చేప ఎప్పుడు నీళ్ళు తాగుతుందో తెలుసుకోవడం అసాధ్యం, అలాగే ప్రభుత్వోద్యోగి డబ్బు దొంగిలిస్తున్నప్పుడు కనుగొనడం అసాధ్యం.”


“Success needs action. Action needs initiative.”
“విజయానికి చర్య అవసరం. చర్యకు చొరవ అవసరం.”

Motivational Quotes by Chanakya


“Avoid him who talks sweetly before you but tries to ruin you behind your back, for he is like a pitcher full of poison with milk on top.”
“మీ ముందు తీపిగా మాట్లాడి, మీ వెనుక మిమ్మల్ని నాశనం చేయడానికి ప్రయత్నించే వ్యక్తిని నివారించండి, ఎందుకంటే అతను పైన పాలతో లోపల విషంతో నిండిన కాడ లాంటివాడు.”


“God does not dwell in the wooden, stony, or earthen idols. His abode is in our feelings, our thoughts.”
“దేవుడు చెక్క, రాతి లేదా మట్టి విగ్రహాలలో నివసించడు, అతని నివాసం మన భావాలలో, మన ఆలోచనలలో ఉంది.”


“Humbleness is at the root of self-control.”
“వినయం స్వీయ నియంత్రణ యొక్క మూలం.”


“There are three gems upon this earth; food, water, and pleasing words – fools consider pieces of rocks as gems.”
“ఈ భూమిపై మూడు రత్నాలు ఉన్నాయి; ఆహారం, నీరు మరియు ఆహ్లాదకరమైన పదాలు – మూర్ఖులు రాతి ముక్కలను రత్నాలుగా భావిస్తారు.”


“If people are prosperous even a leaderless state can be governed.”
“ప్రజలు సుభిక్షంగా ఉంటే నాయకుడు లేని రాష్ట్రాన్ని కూడా పరిపాలించవచ్చు.”


“By failing to plan, you are planning to fail. Every effective performance is based on thorough preparation.”
“ప్లాన్ చేయడంలో విఫలమవ్వడం ద్వారా, మీరు విఫలమవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రతి ప్రభావవంతమైన పనితీరు సమగ్ర తయారీపై ఆధారపడి ఉంటుంది.”


“It’s better to die than to preserve this life by incurring disgrace.”
“అవమాన పడుకుంటూ ఈ జీవితాన్ని కాపాడుకోవడం కంటే చనిపోవడం మంచిది.”

OUR YOUTUBE CHANNEL

Thank you so much for supporting our website.